ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ… ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు సంచలన సవాల్ విసిరింది… రెండేళ్లలో పోలవరం ప్రాజెక్ట్ పనులను పూర్తి చేసి చూపిస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు…
అంతేకాదు తాము రెండేళ్లలో ప్రాజెక్ట్ పనులను పూర్తి చేసి చూపిస్తే టీడీపీ నాయకులందరు రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని సవాల్ విసిరారు. తాజగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు…
కాలువ పనులకు రివర్స్ టెండర్ వేయడం ద్వారా 58 కోట్లు మిగిలాయని అన్నారు… అలాగే పోలవరం టెండర్లలో 780 కోట్లు మిగిలాయని అన్నారు. రివర్స్ టెండర్ వేయకపోతే ఈ డబ్బంతా టీడీపీ నాయకుల జేబుల్లో వెళ్లేదని అన్నారు అనిల్ కుమార్ యాదవ్.