ఇండియాలో కరోనా మహమ్మారి ఎంతటి కల్లోలం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మహమ్మారి కొత్త వేరియంట్లుగా పుట్టుకొచ్చి పెను నష్టాన్ని మిగిల్చింది. ఇప్పటికి మూడు వేవ్ లుగా వచ్చిన ఈ మహమ్మారి ఎందరినో పొట్టనబెట్టుకుంది. ఇక తాజాగా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది.
ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం..గడిచిన 24 గంటల్లో19,893 మందికి వైరస్ నిర్ధరణ కాగా.. మరో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో కొవిడ్ నుంచి 20,419 మంది కోలుకున్నారు.
రికవరీ రేటు 98.50 శాతానికి పెరిగింది. యాక్టివ్ కేసులు 0.31శాతంగా ఉన్నాయి.
మొత్తం కేసులు : 4,40,19,811
మొత్తం మరణాలు: 5,26,530
యాక్టివ్ కేసులు: 1,36,478
కోలుకున్నవారి సంఖ్య: 4,34,24,029