తిరుమలలో భక్తుల రద్దీ..శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

0
81

తిరుమలలో భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరుగుతుంది. ఎటుచూసినా భక్తజన సందోహమే కనిపిస్తోంది. క్యూలైన్లు, సత్రాలన్నీ నిండిపోయి కిక్కిరిసిపోయాయి. కాగా తిరుమలలో ప్రస్తుతంరూ.300ల ప్రత్యేక దర్శనం, సర్వదర్శనానికి మాత్రమే టీటీడీ అనుమతిస్తోంది.

ఈ నేపథ్యంలో తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది.  శ్రీవారి సర్వదర్వనానికి 36 నుంచి 48గంటల సమయం పడుతుంది. మరోవైపు ఈనెల 21వరకు వీఐపీ బ్రేక్‌ దర్శనాలు, ప్రోటోకాల్‌ దర్శనాలు, సిఫార్సు దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. ఇక క్యూలైన్లలో భక్తులను కంట్రోల్‌ చేయడానికి అష్టకష్టాలు పడుతున్నారు పోలీసులు. కొండపైకి ఉరుకులు పరుగులతో దూసుకొస్తున్న భక్తులకు సర్దిచెబుతూ పంపిస్తున్నారు.

మరోవైపు, సెప్టెంబర్ 27 నుండి శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇందులో ప్రధానంగా సెప్టెంబర్‌ 27న ధ్వజారోహణం, అక్టోబర్ 1న గరుడ సేవ, అక్టోబర్‌ 2న స్వర్ణరథం, అక్టోబర్‌ 4న రథోత్సవం, అక్టోబర్‌ 5న చక్రస్నానం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో తొలి రోజైన సెప్టెంబర్‌ 27న ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.