బాదంప‌ప్పును ఏ స‌మ‌యంలో తింటే మంచిదో తెలుసా?

0
84

ప్రస్తుత జీవన విధానం పూర్తిగా మారిపోయింది. తినడానికి తీరిక లేని సమయం. అంతకుమించి ఒత్తిడి. ఇవన్నీ కూడా ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే ఆరోగ్యానికి పోషకాహారం ముఖ్యమైంది. ఇక డ్రై ఫ్రూట్స్, న‌ట్స్ లాంటివి స్నాక్స్ రూపంలో తీసుకోవ‌డం మంచిది.

ఇందులో ముఖ్యంగా బాదంని ప్ర‌తీరోజూ తీసుకోవడం వ‌ల్ల ఎలాంటి ఉప‌యోగాలు ఉంటాయో, ఏ స‌మ‌యంలో తిన‌డం స‌రైన‌దో.. ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. బాదం గింజ‌ల‌లో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ మ‌న‌ల్ని యాక్టివ్ గా ఉంచుతుంది. వీటిని విట‌మిన్ బి6 ల‌భించే అర‌టి ప‌ళ్లు ఇంకా ఓట్స్ తో క‌లిపి తీసుకున్న‌పుడు బాదంలో ఉండే ట్రిప్టోఫాన్ మ‌న శ‌రీరంలో సెరొటోనిన్ గా మారుతుంది.

ఈ సెరొటోనిన్ మ‌నలో ఎన‌ర్జీ బూస్ట‌ర్ లా ప‌నిచేస్తుంది. ఇంకా మ‌న‌లో ఉత్సాహాన్ని పెంచ‌డంతోపాటు వ్యాకుల‌తని కూడా త‌గ్గించ‌డానికి కూడా స‌హాయ‌ప‌డుతుంది. దీని కోసం ఉద‌యాన్నే ఓట్ మీల్ తోపాటు అర‌టి ప‌ళ్లు ఇంకా బాదంని క‌లిపి తీసుకోవాలి. బాదంలో విట‌మిన్ ఇ పుష్క‌లంగా ఉంటుంది. 20 బాదం గింజ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం రోజూ వారీగా తీసుకోవాల్సిన మోతాదులో 48 శాతం విట‌మిన్ ఇ ని పొంద‌వ‌చ్చు.

ఇంకా రోజూ బాదం గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల అవి ఆక‌లిని త‌గ్గిస్తాయి. దాని వ‌ల‌న బ‌రువు త‌గ్గ‌డానికి కూడా అవ‌కాశం ఉంటుంది. అయితే బాదంను ఉద‌యం పూట తీసుకోవ‌డం వ‌ల్ల‌నే ఎక్కువ ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ని ప‌రిశోధ‌నలు చెబుతున్నాయి. వీటిని ఉద‌యం అల్పాహారంలో భాగం చేసుకొని తిన‌డం వ‌ల‌న జీవ‌క్రియ మెరుగుప‌డ‌డంతో పాటు ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉండి రోజంతా ఉత్సాహంగా ఉంటారు.