ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. పెడనలో జరిగే ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ నాలుగో విడత కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా లబ్దిదారుల ఖాతాలో సీఎం జగన్ నగదును జమ చేయనున్నారు.
ఇప్పటికే మూడు విడతల్లో నేతన్నల కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు ఏడాదికి రూ.24 వేలు అందిస్తోంది సర్కార్. ఐదేళ్లలో లబ్దిదారుడికి రూ.1,20,000 సాయం అందనుంది. వైయస్సార్ నేతన్న నేస్తం కింద 80,546 మంది ఖాతాల్లో రూ. 24 వేల చొప్పున రూ.193.31 కోట్లను సీఎం జగన్ జమ చేయనున్నారు.
పర్యటన వివరాలు ఇలా..
ఉదయం 10 గంటలకు జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరి 10.40 గంటలకు పెడన చేరుకుంటారు.
10.50 గంటలకు పెడన బంటుమిల్లి రోడ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం పాల్గొంటారు.
ముందుగా వైఎస్‌ఆర్ నేతన్న నేస్తం లబ్దిదారులతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది.
అనంతరం అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.