నిరుద్యోగులకు గుడ్ న్యూస్..కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చేయనున్నారు.
అర్హత ఏంటంటే?
పోస్టును బట్టి సంబంధిత విభాగాల్లో కనీసం 55 శాతం మార్కులతో పీజీ, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో 3 నుంచి 10 ఏళ్ల టీచింగ్ అనుభవం ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 41 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఈమెయిల్ విధానంలో అక్టోబర్ 10, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది.
అనంతరం హార్డ్‌కాపీలను కింది అడ్రస్‌కు అక్టోబర్ 10, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు పంపించవల్సి ఉంటుంది. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ప్రతిభ కనబరచిన వారికి నెలకు రూ.70,900ల నుంచి రూ.1,44,200ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఈ మెయిల్ ఐడీ: acultyrecruit2022sepsrd@iimv.ac.in
అడ్రస్: THE SENIOR ADMINISTRATIVE OFFICER INDIAN INSTITUTE OF MANAGEMENT VISAKHAPATNAM ANDHRA UNIVERSITY CAMPUS VISAKHAPATNAM – 530 003 ANDHRA PRADESH, INDIA.