Nara Lokesh Fires On CM Jagan: అసలు ఆంధ్రప్రదేశ్లో దిశా చట్టం ఉందా అని మాజీ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) ప్రశ్నించారు. లేని చట్టం పేరుతో ప్రజలను జగన్ మోసం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఒక్కసారైనా గన్ కంటే ముందు జగన్(Jagan) వచ్చి.. ఒక్క ప్రాణమైనా కాపాడితే అభినందించాలని ఉందని అన్నారు. మాయ మాటలు, కపట ప్రకటనలు ఇకనైనా ఆపి.. కాకినాడలో యువతిని చంపిన ప్రేమోన్మాదిపై చర్యలు తీసుకోవాలని హితువు పలికారు. నేరాలపై తూతూ ప్రకటనలతో బాధితులకు ఎటువంటి న్యాయం జరగదని లోకేష్ ట్వీట్ చేశారు.
Nara Lokesh: లేని చట్టం పేరుతో జగన్ మోసం చేస్తున్నారు
-