Nadendla Monohar: జనసేనకు జనాదరణ పెరుగుతోందని, జనసైనికులను ఇబ్బందులు పెట్టేలా వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ సందర్భంగా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పీఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖలో జరిగిన ఘటన రాష్ట్రం మొత్తం చూసిందని.. జనసేన నాయకుల పై అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేశారని మండిపడ్డారు. అధికార ప్రభుత్వ దాష్టికాలను జనసేన నాయకులు ఎదుర్కొన్న తీరు అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్‌లో ప్రజాస్వామ్యపరిరక్షణకు జనసైనికులు నడుం కట్టాలని, వైసీపీ ప్రభుత్వం అరాచకాలు, అవినీతిని నిలదీయాలని పిలుపునిచ్చారు.హోటల్‌లో చొరబడి మరీ జనసేన నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో లేనివారిపై హత్యాయత్నం కేసులు పెట్టారన్నారు. జైలుకు వెళ్లిన నాయకులు, వారి కుటుంబ సభ్యులను పవన్ కళ్యాణ్ కలిశారని(Nadendla Monohar)వివరించారు.
Nadendla Monohar: జనసైనికులను ఇబ్బందులు పెట్టేలా వైసీపీ కుట్ర
-
- Advertisement -