IT Raids on Minister Mallareddy: తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ఇళ్లపై మంగళవారం తెల్లవారుజాము నుంచి ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. 50 బృందాలు ఏకకాలంలో మంత్రి ఇళ్లతో పాటు మెడికల్ కాలేజీలు, ఆఫీసుల్లో సోదాలు చేస్తున్నారు. మంత్రి నివాసంతో పాటు మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డితో పాటు ఇతర బంధువుల ఇళ్లపైనా దాడులు చేస్తున్నారు. కాగా, మల్లారెడ్డికి సంబంధించిన విద్యా సంస్థలలో ఐటీ ఫైల్ చేయటంలో లోపాలుండటంతోనే.. ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఐటీ దాడుల్లో భాగంగా దూలపల్లిలోని మల్లారెడ్డి కళాశాలలో ఐటీ అధికారులు నగదును స్వాధీనం చేసుకొని, మెషిన్ ద్వారా అధికారులు లెక్కిస్తున్నారు.
- Advertisement -