Forest Range Officer Sriniva Rao was Attacked by the tribals: భద్రాది కొత్తగూడెం జిల్లాలోని చండ్రుగొండలో ఫారెస్ట్ రేంజర్‌పై గుత్తికోయలు దాడి చేశారు. పోడు భూమి విషయంలో వాగ్వాదం తలెత్తడంతో గుత్తికోయలు ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్‌పై వేట కొడవళ్లతో దాడి చేశారు. కాగా ఈ దాడిలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వెంటనే ఆయనను కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.
శ్రీనివాస్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే.. ఫారెస్ట్ భూములకి పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వ యంతాంగం సర్వేలో జరుగుతుంది. కాగా.. వారికి వ్యతిరేఖంగా ఫారెస్ట్ భూముల కోసం గిరిజనుల పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేక సార్లు ఫారెస్ట్ అధికారులకి గిరిజనులకు మధ్య వివాదాలు జరుగుతున్నాయి. పోడు పట్టాలు ఇవ్వకుండా ఫారెస్ట్ అధికారులు ప్లాంటేషన్ చేయటాన్ని నిరసిస్తూ నేడు గిరిజనులు ప్లాంటేషన్ మొక్కలను ధ్వంసం చేస్తుండగా ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో గిరిజన రైతులకు ఫారెస్ట్ అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహానికి లోనైన గిరిజనులు ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ (Forest Range Officer Sriniva Rao) పై దాడిచేసినట్లు తెలుస్తోంది.