జగన్ పై భగ్గుమన్న చంద్రబాబు

జగన్ పై భగ్గుమన్న చంద్రబాబు

0
88

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు… జగన్ ఫెయిల్డ్ సీఎం అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు…. ఏపీ లో ప్రస్తుతం జగన్ రౌడీ రాజ్యం కొనసాగుతోందని చంద్రబాబు విమర్శించారు…

తూర్పుగోదావరి జిల్లాలో జర్నలిస్ట్ సత్యనారాయణ హత్య రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలకు నిదర్శనం అని అన్నారు. తనకు ప్రాణాపాయం ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను కోరినా, చర్యలు తీసుకోకపోవడం శోచనీయం అని చంద్రబాబు ఆరోపించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు.

గత 4 నెలలుగా రాష్ట్రంలో దాడులు పెరగడం ఆందోళనకరంగా ఉందని చంద్రబాబు ఆరోపించారు. నెల్లూరులో జమీన్ రైతు సంపాదకుడిపై, మైనారిటీ వర్గానికి చెందిన జర్నలిస్ట్ పై, చీరాలలో జర్నలిస్ట్ పై, ఇలా వరుస దాడులకు పాల్పడుతూ ప్రశ్నించే గొంతును నొక్కాలని చూస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం అని అన్నారు..