Telangana summer holidays: సమ్మేటివ్ అసెస్మెంట్-2 పరీక్షలు, వేసవి సెలవులపై తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 10 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా, ఏప్రిల్ 12 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు అంటే దాదాపు 48 రోజులు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. జూన్ 12న స్కూళ్లు పునః ప్రారంభం కానున్నాయి. మరోవైపు ఎండల తీవ్రత దృష్ట్యా మార్చి రెండో వారం నుంచి ఒంటి పూట తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
విద్యార్థులకు గుడ్ న్యూస్.. సమ్మర్ హాలిడేస్ ప్రకటించిన విద్యాశాఖ
-