TRS Party |ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సెంటిమెంట్‌తో టీఆర్ఎస్ పార్టీ మళ్లీ ఆవిర్భవించనున్నట్లు సమాచారం. టీఆర్ఎస్.. బీఆర్ఎస్‌గా మారడం ఇష్టంలేని కొందరు నేతలు తెలంగాణ రాజ్య సమితి(TRS) పేరుతో పార్టీ పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గుర్తింపు పొందిన పార్టీగా తెలంగాణ రాజ్యసమితి ఉండటంతో తెలంగాణ రైతు సమాఖ్య పేరుతో రిజిస్ట్రేషన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. జెండా రంగు బ్రైట్ పింక్ లేదా వాటర్ మిలాన్ పింక్‌ను ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ వార్తలు విస్తృతమైన నేపథ్యంలో ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన పలువురు కీలక నేతలు, తెలంగాణ ఉద్యమ కారులు కొత్త పార్టీవైపు చూస్తున్నట్లు సమాచారం.
Read Also: నవీన్ హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. రాచకొండ సీపీ కీలక వ్యాఖ్యలు
Follow us on: Google News