Bandi Sanjay |ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు సంస్థలు స్పీడ్ పెంచాయి. ఈ కేసులో ఇప్పటికే అరుణ్ పిళ్లయ్‌ను అరెస్ట్ చేసిన ఈడీ.. బుధవారం ఎమ్మెల్సీ కవిత నోటీసులు ఇచ్చింది. ఈ నెల 9న ఢిల్లీలో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది. తాజాగా.. కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్(Bandi Sanjay) స్పందించారు. ఈ కేసులో కవిత తప్పు లేకుంటే కోర్టులో నిరూపించుకోవాలన్నారు. కవిత లిక్కర్ దందా తన కుంటుంబం కోసం చేసిందా లేక తెలంగాణ సమాజం కోసం చేసిందా అని ప్రశ్నించారు. మీరు చేసే అడ్డగోలు దందాలన్నింటికీ తెలంగాణ సమాజానికి అంటగడితే ఎలా అని నిలదీశారు. కేసీఆర్ కుటుంబ చరిత్ర ఏంటో అందరికీ తెలుసని, దర్యాప్తు సంస్థలకు బీజేపీతో ఏం సంబంధం అన్నారు. కేసీఆర్ బిడ్డ దొంగ సారా దందా చేస్తూ తెలంగాణ సమాజం తలవంచదంటే నవ్వొస్తోందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ బిడ్డ కవిత చేసిన దుర్మార్గపు చర్యలను ప్రజలు చీత్కరించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. లిక్కర్ స్కామ్‌లో కవిత ప్రమేయంపై కేసీఆర్, కేటీఆర్ ఇప్పటి వరకు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
Read Also: ఇలాంటి చర్యలకు కేసీఆర్ లొంగడు.. నోటీసులపై కవిత ఘాటు స్పందన
Follow us on: Google News