కేసీఆర్ సర్కార్‌‌కు.. తిరస్కరించిన సుప్రీంకోర్టు

-

Supreme Court |బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సుప్రీంకోర్టు జులై 31కి వాయిదా వేసింది. కేసు న్యాయస్థానం పరిధిలో ఉన్నందున దర్యాప్తు కొనసాగించవద్దని నిబంధన ఉందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అప్పటి వరకు దర్యాప్తు రికార్డులు సీబీఐకి అందించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. దర్యాప్తుపై స్టేటస్ కో కొనసాగించాలని ఈమేరకు సోమవారం ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కాగా, ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు తీర్పును ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ సోమవారం ఈ పిటిషన్‌ను సోమవారం విచారించి స్టే ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది.

- Advertisement -
Read Also: రాహుల్ గాంధీ సారీ చెప్పాల్సిందే: కేంద్ర మంత్రి

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...