ఎకరానికి పది వేల పరిహారం చాలదు: బండి సంజయ్

-

సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం హైదరాబాద్‌లోని పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అకాల వర్షాలతో పంటనష్టపోయిన రైతులను కేసీఆర్ పరామర్శించడానికి బీజేపీ పార్టీనే కారణమని అన్నారు. కేసీఆర్‌ను ఫామ్ హౌజ్ వదిలి పొలం బాట పట్టించింది బీజేపీ నేతలే అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ తన సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి కేంద్రాన్ని తిట్టడం మొదలుపెట్టారని అన్నారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఫసల్ బీమా యోజన అమలైతే రైతులకు లాభం కలిగి ఆ మంచి పేరు కేంద్ర ప్రభుత్వానికి పోతుందన్న రాజకీయ దురుద్దేశంతోనే అమలు చేయడం లేదని ఆరోపించారు.

- Advertisement -

తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం ఎన్నికలు రానుండడంతో ప్రగతిభవన్‌ను, ఫామ్ హౌజ్‌ను వదిలి రైతులను పలకరించడానికి పొలం బాట బట్టి ఎనలేని ప్రేమను ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. పంట నష్టపోయిన రైతులకు ఒక్కో ఎకరాకు రూ. 10 వేల చొప్పున పరిహారం అందిస్తామని కేసీఆర్(KCR) ప్రకటించడం కంటి తుడుపు చర్యేనని అన్నారు. ఈ సాయం రైతులకు ఏ మూలకూ సరిపోదన్నారు. అయినా ఇదే గొప్ప సాయమంటూ చెప్పుకోవడం సిగ్గు చేటని బండి(Bandi Sanjay) విమర్శించారు.

Read Also: గవర్నర్ ని కలిసిన తీన్మార్ మల్లన్న వైఫ్

Follow us on: Google News  Koo

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sonnalli Seygall | పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్..

బాలీవుడ్ నటి సోనాలి సెగల్(Sonnalli Seygall) తన అభిమానులు తీపి కబురు...

Chhava | పుష్ప-2 దెబ్బకు పోటీ నుంచి తప్పుకున్న ‘ఛావా’

Chhava - Pushpa 2 | అల్లు అర్జున్, రష్మిక జంటగా...