Dog attack on child |ఇటీవల తెలంగాణలో కుక్కల దాడి ఘటనలు ఎక్కువైపోతున్నాయి. గతనెల క్రితం అంబర్‌పేట్‌లో బాలుడు మృతిచెందిన ఘటన మరువకముందే అనేకచోట్ల కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోనే మరో దారుణ సంఘటన జరిగింది. హైదరాబాద్‌లోని బడంగ్ పేట్ మున్సిపాలిటీ పరిధిలో విధి కుక్క స్వైర విహారం చేసింది. శనివారం టీచర్స్ కాలనీలో నడుచుకుంటూ వెళుతోన్న ఓ ఐదేళ్ల కుర్రాడిపై వీధి కుక్క ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో ఆ చిన్నారి కిందపడిపోయాడు. దీంతో బాలుడు ఒక్కసారిగా అరడంతో స్థానికంగా ఉన్న వాళ్లు విని బాబును కాపాడారు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతోంది.
- Advertisement -
Read Also: బండి సంజయ్కుమారుడికి హైకోర్టులో ఊరట
Follow us on: Google News, Koo, Twitter