ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో భారత్‌కు రెండు గోల్డ్ మెడల్స్

-

International Boxing Championship |ఢిల్లీ వేదికగా జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో భారత్‌కు రెండు స్వర్ణ పతకాలు లభించాయి. 48 కేజీల విభాగంలో మంగోలియాకు చెందిన లుత్‌సాయిఖాన్ అల్టాంట్‌సెట్‌సెగ్‌ను 5-0 తేడాతో ఓడించి నీతూ ఘంఘూస్ స్వర్ణం పతకం గెలిచింది. ఇక 81 కేజీల విభాగం ఫైనల్లో భారత బాక్సర్‌ సావిటీ బూరా చైనాకు చెందిన వాంగ్ లీనాను ఓడించి పసిడి పతకం కైవసం చేసుకుంది.

- Advertisement -

Boxing Championship |ఫైనల్లో ప్రత్యర్థిపై తొలి రౌండ్ నుంచే పంచ్లతో సావిటీ విరుచుకుపడింది. రెండో రౌండ్‌లో కాస్త పోటీ ఎదుర్కొన్నా.. నిర్ణయాత్మక మూడో రౌండ్‌లో పూర్తి ఆధిపత్యం కనబరిచి 4-3తో స్వర్ణం కైవసం చేసుకుంది. టోర్నమెంట్ చరిత్రలో స్వర్ణం గెలిచిన ఏడో భారతీయ మహిళగా సావీటీ స్థానంలో నిలిచింది. అంతకుముందు 48 కేజీల విభాగంలో నీతూ ఘంగాస్ భారత్‌కు తొలి బంగారు పతకం అందించింది. ఫైనల్లో మంగోలియాకు చెందిన లుట్సాయ్‌ఖాన్‌ అల్‌టాంట్‌సెట్‌సెగ్‌పై 5-0 తేడాతో నీతూ విజయం సాధించింది.

Read Also: ‘రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయకుండా ఉండాల్సింది’

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన వరంగల్ మేయర్

లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి....

ఒకప్పటి ప్రత్యర్థి కోసం మద్దతుగా చంద్రబాబు ప్రచారం

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి నిదర్శనంగా చంద్రబాబు,...