మహారాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ ఓపెన్ చాలెంజ్

-

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని లోహాలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో దేశంలో తుఫాన్ రాబోతోందని.. దానిని ఎవరూ ఆపలేరని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నాందేడ్‌కు రాగానే స్థానిక రైతుల ఖాతాల్లో రూ.6 వేలు జమ అయ్యాయని, వాటిని ముందే ఎందుకు ఇవ్వలేదని మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. బిచ్చం వేసినట్లు రూ.6 వేలు ఇవ్వడం ఏంటని, రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.10 వేలు ఇచ్చే వరకు కొట్లాడుతామని అన్నారు. రైతుబీమా ద్వారా తెలంగాణ రైతులకు రూ.5 లక్షలు ఇస్తున్నాం, దళితుల కోసం దళితబంధు తీసుకొచ్చి రూ.10 లక్షల సాయం చేస్తున్నామని గుర్తుచేశారు.

- Advertisement -

వాటిని మహారాష్ట్రలో ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. ‘మహారాష్ట్రలో దళితబంధు పథకాన్ని అమలు చేయండి.. తాను ఇక్కడికి రాను’ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. దళితజాతి వజ్రమైన అంబేద్కర్ పుట్టిన నేలమీద దళితులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని అన్నారు. భారత పౌరుడిగా తాను ప్రతీ రాష్ట్రానికి వెళ్తానని, అన్ని రాష్ట్రాల్లో పరిస్థితులను గమనించి సూచనలు, విమర్శలు చేస్తానని తెలిపారు. స్వాతంత్ర్య వచ్చి 75 ఏళ్లు దాటినా ప్రజల బతుకులు మారలేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ దేశాన్ని అత్యధికసార్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఈ దేశానికి, రైతులకు ఏం చేయలేకపోయాయని మండిపడ్డారు.

ఈ రెండు పార్టీల వల్ల ఇక ఒరిగేది ఏమీ లేదని, ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. దేశంలో సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని, అయినా, అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ కనీసం తాగునీరు దొరకక అల్లాడుతున్నారని అన్నారు. మహారాష్ట్రలో తెలంగాణ తరహా పరిపాలన అందిస్తామని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేస్తామని అన్నారు. తెలంగాణ మోడల్‌లాగా రైతుకు ప్రతి ఎకరాకు రూ.10 అందజేస్తామని ప్రకటించారు. అంతకుముందు మహారాష్ట్రకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు బీఆర్ఎస్‌లో చేరారు. వారికి సీఎం కేసీఆర్(CM KCR) గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Read Also: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో భారత్‌కు రెండు గోల్డ్ మెడల్స్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...