బండి సంజయ్​కుమారుడికి హైకోర్టులో ఊరట

-

Bandi Sai Bhageerath |బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​కుమారుడు భగీరథ్‌కు హైకోర్టు నుంచి ఊరట దక్కింది. తోటి విద్యార్థిని చితకబాదాడన్న నేరారోపణలపై సస్పెన్షన్‌లో ఉన్న భగీరథ్‌ను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు క్లాసులకు అనుమతించాలని హైకోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మహీంద్రా యూనివర్సిటీలో బీటెక్​ ఫస్ట్ ​ఇయర్​ చదువుతున్న భగీరథ్​తన స్నేహితునితో కలిసి జనవరిలో తోటి విద్యార్థిని చితకబాదిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్​మీడియాలో వైరల్​అయ్యింది.

- Advertisement -

ఈ వీడియోను చూసిన వర్సిటీ అధికారులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ 341, 323, 504, 506 సెక్షన్ల ప్రకారం భగీరథ్(Bandi Sai Bhageerath) ​అతని స్నేహితునిపై కేసులు నమోదు చేశారు. దీనిపై భగీరథ్​హైకోర్టుకు వెళ్లాడు. తన వివరణ తీసుకోకుండానే వర్సిటీ వర్గాలు సస్పెండ్​చేశాయని, ఫలితంగా తరగతులకు హాజరు కాలేకపోతున్నానని పిటీషన్​దాఖలు చేశాడు. తనపై విధించిన సస్పెన్షన్​ను ఎత్తివేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించాడు. దీనిపై విచారణ చేసిన హైకోర్టు శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి నిర్ణయం తీసుకునే వరకు భగీరథ్ తరగతులకు హాజరయ్యేందుకు అనుమతించాలని అధికారులను ఆదేశించింది.

Read Also: ఇకపై భయమంటే ఏంటో ప్రభుత్వానికి చూపిస్తా: బండి సంజయ్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు....

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...