Venkaiah Naidu |సాయి కుమార్, అనసూయ ప్రధాన పాత్రలో నటించిన ‘అరి(ARI)’ సినిమా ట్రైలర్‌పై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసలు కురిపించారు. ఆర్వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ సినిమా ట్రైలర్‌న గురువారం వెంకయ్య నాయుడు వీక్షించారు. పేపర్ బాయ్ చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం అరి. పాన్ ఇండియన్ ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ‘ఈ రోజు ‘అరి’ ప్రచార చిత్రాన్ని వీక్షించడం జరిగింది. చాలా సంతోషం. ఒక చక్కని ఇతివృత్తం, సందేశంతో కూడిన సినిమాను తీయాలని సంకల్పించడం చాలా అభినందనీయం. అలాంటి ఇతివృత్తంలో ఈ చిత్రం నిర్మించడం చాలా సంతోషం.’ అని అభినందించారు.
Read Also: అర్ధరాత్రి పాతబస్తీలో గ్యాంగ్ వార్.. రక్తసిక్తమైన కాలనీ!
Follow us on: Google News, Koo, Twitter