విశాఖ ఉక్కు పరిశ్రమ(Vizag Steel Plant) కొనుగోలుకు సిద్దమైన బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం ఆ దిశగా అడుగులు ముందుకేస్తోంది. తాజాగా సింగరేణి పరిశ్రమకు చెందిన ముగ్గురు అధికారులను వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు పంపింది. అక్కడికి సింగరేణి డైరెక్టర్లు కార్మికులు, ఉద్యోగులతో సమావేశమవుతారు. అక్కడ నెలకొన్న పరిస్థితులు, బిడ్డింగ్ లో తెలంగాణ(Telangana) ప్రభుత్వం పాల్గొనే అంశాలను వివరించి వారి అభిప్రాయం తీసుకోనున్నారు. అసలు సింగరేణి జాయింట్ కాలరీస్ సంస్థ ద్వారా బిడ్డింగ్ లో పాల్గొనే అవకాశం ఉందో లేదో ఆరా తీయనున్నారు.
మరి దీనిపై అధికార వైసీపీ(YCP) ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. సోమవారం మంత్రి అమర్నాథ్(Gudivada Amarnath) మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం బిడ్డింగ్ లో పాల్గొనుందనే వార్తలు తప్ప ప్రత్యక్ష కార్యాచరణ అమలు చేయలేదు కదా అని తెలిపారు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఏకంగా ముగ్గురు అధికారులను స్టీల్ ప్లాంట్ కు పంపడంతో వైసీపీ మంత్రులు, నేతలు ఏ సమాధానం చెబుతారో మరి. కాగా ఏపీలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణకు స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant) అంశాన్ని అస్త్రంగా కేసీఆర్ మలుచుకున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Read Also: లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్ దంపతులు
Follow us on: Google News, Koo, Twitter