టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni) తన కెరీర్ లో ఎవరికి సాధ్యంకాని ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు. తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకోబోతున్నాడు. ఐపీఎల్ టోర్నీలో చెన్నై జట్టుకు సారథిగా 200వ మ్యాచ్ ఆడనున్నాడు. నేడు రాజస్థాన్ రాయల్స్ తో జరిగే మ్యాచులో ఈ ఘనత అందుకోనున్నాడు. ఈ మ్యాచ్ ధోనికి సీఎస్కే జట్టు సారథిగా 200వ మ్యాచ్ కావడం విశేషం. 2008 నుంచి ఇప్పటివరకు 199 మ్యాచులకు చెన్నై జట్టుకు ధోని(MS Dhoni) సారథ్యం వహించగా.. 120 మ్యాచులు గెలిపించాడు. ఇప్పటివరకు మొత్తం 213 మ్యాచులకు పుణే జట్టుతో కలిసి కెప్టెన్సీ వహించాడు. ధోని తర్వాత ముంబై కెప్టెన్ గా రోహిత్(Rohit Sharma) 146 మ్యాచులకు, విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆర్సీబీ జట్టుకు 140 మ్యాచులకు సారథిగా వ్యవహించారు. కాగా ఈ సీజన్ తర్వాత ధోని ఐపీఎల్ కు గుడ్ బై చెప్పనున్నాడని తెలుస్తోంది.
Read Also: రికార్డ్ క్రియేట్ చేసిన ‘పుష్ప-2’ గ్లింప్స్ వీడియో
Follow us on: Google News, Koo, Twitter