అరవింద సమేత లో ఫోటో లీక్

అరవింద సమేత లో ఒక ఫోటో లీక్

0
110

ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అరవింద సమేత’. దసరాకు ఈ చిత్రాన్ని విడుదల చేయనుండగా.. అందుకు తగ్గట్లుగా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా ఈ చిత్రం నుంచి తాజాగా ఓ ఫొటో లీక్ అయ్యింది. అందులో వర్షం పడుతుండగా.. నాగబాబు తీవ్ర గాయాలతో ఉన్నాడు. అతడిని కారులో తీసుకెళ్తూ, ధీనంగా చూస్తూ, గడ్డం పట్టుకొని లేపుతున్నట్లుగా ఉంది. చూస్తుంటే ఈ ఫొటో చిత్రానికి కీలకమైన సన్నివేశమని తెలుస్తోంది. ఇక పిక్‌ను ఎవరు లీక్ చేశారో తెలీదు కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా ఫ్యాక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. ఈషా రెబ్బా కీలక పాత్రలో కనిపించనుంది. హారిక అండ్ హాసిని పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.