జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈసారి విశాఖలోని రుషికొండ తవ్వకాలపై ట్విట్టర్ లో సెటైరికల్ కామెంట్స్ పోస్ట్ చేశారు. చెట్లు, కొండలు, తీరప్రాంతాలు, మడ అడవులను పాడు చేయడం అనేది వైసీపీ దుష్టపాలకుల ముఖ్య లక్షణమని ఆరోపించారు. రుషికొండ తవ్వకాలలో ప్రభుత్వం నిబంధనలను ఉల్లఘించిందని కేంద్ర కమిటీ నిర్థారించిందని.. దీనిపై ప్రభుత్వం సమాధానం చెబుతుందా లేక రిషికొండ గ్రీన్ మ్యాట్ పై 151 అడుగుట స్టిక్కర్ అంటిస్తుందా? అని సెటైర్లు వేశారు పవన్.
రుషికొండ తవ్వకాల్లో జగన్ సర్కార్ నిబంధనలు ఉల్లఘించిందంటూ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గతేడాది హైకోర్టులో పిటిషన వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం నిజనిర్థారణ కోసం కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ క్షేత్రస్థాయి పరిస్థితులు గమనించిన ప్రభుత్వం తవ్వకాల్లో నిబంధనలు ఉల్లఘించిందని నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా జనసేనాని(Pawan Kalyan) ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
Cutting Down Trees, Hills, Tampering Coastal Zones, Mangroves has been hallmark of YCP Misgovernance. The 5 member expert panel concluded YCP govt violated norms bulldozed laws in destroying Rushikonda. Will YCP Govt answer or go paste a 151 ft sticker on Rushikonda green mat? pic.twitter.com/uryQqYk9kJ
— Pawan Kalyan (@PawanKalyan) April 14, 2023
Read Also: వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరుడు ఉదయ్ అరెస్ట్
Follow us on: Google News, Koo, Twitter