మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు(Viveka Murder Case)లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. మొన్న అవినాశ్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసిన అధికారులు.. నేడు భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇవాళ తెల్లవారుజామునే పులివెందులలో భాస్కర్ రెడ్డి నివాసముంటున్న ఇంటికి సీబీఐ అధికారులు రెండు వాహనాల్లో వచ్చారు. ఆయన అనుచరులను ఇంటి బయటే నిలిపివేసిన అధికారులు.. లోపలికి వెళ్లి భాస్కర్ రెడ్డి(YS Bhaskar Reddy)ని విచారించారు. అనంతరం ఆయన భార్య లక్ష్మీకి అరెస్ట్ మెమో ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. పులివెందుల నుంచి కడపకు తీసుకెళ్లిన అధికారులు అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలించారు. సాయంత్రం హైదరాబాద్ లోని సీబీఐ మేజిస్ట్రేట్ ఇంట్లో భాస్కర్ రెడ్డి(YS Bhaskar Reddy)ని హాజరుపర్చనున్నారు.
Read Also: వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరుడు ఉదయ్ అరెస్ట్
Follow us on: Google News, Koo, Twitter