తెలంగాణ రాష్ట్ర రైతులకు మంత్రి గంగుల కమలాకర్(Gangula Kamalakar) శుభవార్త చెప్పారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ధాన్యం కొనుగోలు కోసం అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏడాదిలో వానాకాలం, యాసంగి సీజన్లలో కనీస మద్దతు ధరకు రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ఆదివారం కరీంనగర్ రూరల్ మండలం చర్లబూత్కూరు, ముగ్దంపూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి(Gangula Kamalakar) ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యాసంగి పంట ముందుగానే కోతకు వస్తుందని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 15 రోజులు ముందుగానే ధాన్యం కొనుగోలు ప్రారంభించామన్నారు.
Read Also: మునుగోడు హామీలు ఒక్కటైనా నెరవేర్చాడా?: ఈటల
Follow us on: Google News, Koo, Twitter