టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) మంగళవారం కడప జోన్-5 సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలకు గుడ్ న్యూస్ చెప్పారు. కార్యకర్తల ఆరోగ్య భద్రత కోసం కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో మాట్లాడిన ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు.
వివేకా హత్య కేసు(Viveka Murder Case) భారతదేశానికి కేస్ స్టడీ అన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలిచే ప్రసక్తే లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గెలుపే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు పని చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు ప్రజల్లోకి వెళ్లి చైతన్యం తీసుకురావాలని, నియోజకవర్గ ఇంఛార్జులు ఆయా గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలి అని అన్నారు. టీడిపీ(TDP) నాయకులు, కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే అన్ని సీట్లు వచ్చేలా ఉన్నాయని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ ఎప్పుడూ ముందు ఉంటుంది అనీ, కార్యకర్తల కుటుంబ సంక్షేమం, ఆరోగ్యం కోసం యాప్‍ను ప్రవేశపెట్టాం అని తెలిపారు. అనారోగ్యం వస్తే ఖర్చు పెట్టుకోలేని కార్యకర్తలకు అన్ని టీడీపీ భరించేలా ఆలోచన చేస్తున్నామని చెప్పారు. అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులు పెట్టించి ఆనందపడే జగన్(Jagan)కు ఆఖరి అవకాశం అని, గెలిచేది పసుపు జెండానే అని చంద్రబాబు నాయుడు(Chandrababu) బలంగా చెప్పారు.
Read Also: ప్రజాకోర్టులో వివేకా హత్య కేసు పెడతాం: చంద్రబాబు
Follow us on: Google News, Koo, Twitter