ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా తెలంగాణ(Telangana) హెల్త్ డైరెక్టర్ డాక్టర్గడల శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. మలేరియా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడిచిన ఏడేళ్లలో రాష్ట్రంలో మలేరియా(Malaria)తో ఎవరూ మరణించలేదని స్పష్టం చేశారు. 2014లో 5222 కేసులు ఉండగా, 2015లో 11,880 కేసులు తేలాయన్నారు. ఇదే ఏడాదిలో నలుగురు మృతి చెందినట్లు వెల్లడించారు. ఇక 2016లో 3575 కేసులు తేలగా, ఒకరు చనిపోయినట్లు తెలిపారు. దీంతో పాటు 2017లో 2688 మంది, 2018లో 1792 మంది, 2019లో 1709 మంది, 2020లో 872 మంది, 2021లో 871 మంది, 2022 లో 611 మంది ఈ ఏడాది ఇప్పటి వరకు 84 మందికి మలేరియా సోకినట్లు వెల్లడించారు. జిల్లాల్లో దోమల నివారణ మందులను ఎక్కువగా స్ప్రే చేస్తున్నామన్నారు. ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నామన్నారు.
Read Also: ఏ పార్టీ దయాదాక్షిణ్యాలకు తలొగ్గం: సీపీఐ
Follow us on: Google News, Koo, Twitter