చదువుతో పాటు సమాజంలో తోటివారితో ఎలా మెలగాలో పిల్లలకు తల్లిదండ్రులు నేర్పించడం తప్పనిసరి. ఎందుకుంటే ఏదైనా అనుకోని అపాయం వచ్చినప్పుడు పేరెంట్స్ నేర్పిన సంస్కారమే వారిని గొప్పవారిగా తీర్చిదిద్దుతోంది. ఇదంతా ఎందుకు చెబుతాననంటే అమెరికా(America)లో సెవెన్త్ గ్రేడ్ చదివుతున్న ఓ బాలుడు అపద సమయంలో ఏకంగా 60మంది ప్రాణాలను కాపాడాడు. మిచిగాన్ సిటీకి చెందిన ఓ బస్సులో డ్రైవర్ కళ్లు తిరిగి పడిపోయాడు. ఇది గమనించిన ఆ విద్యార్థి సకాలంలో స్పందించాడు.
America |డ్రైవర్ సీటులోకి వచ్చి ఎమర్జెన్సీ స్టాపర్ సాయంతో బస్సును ఆపివేశాడు. వెంటనే అత్యవసర నెంబర్ కు ఫోన్ చేయాలని తోటివారికి తెలిపాడు. ఈ ఘటన బస్సులోని సీసీ కెమెరాలో రికార్డు అయింది. ప్రాణాలు పణంగా పెట్టి అంతమందిని రక్షించిన బాలుడిని దిల్లాన్ రీవ్స్గా పోలీసులు గుర్తించారు. అత్యవసర సమయంలో చాకచక్యంగా వ్యవహారించి 60మంది ప్రాణాలు కాపాడిన రీవ్స్ ను అధికారులు అభినందించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read Also: ఈ చెట్టు వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
Follow us on: Google News, Koo, Twitter