అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వలేం: తెలంగాణ హైకోర్టు

-

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు(Viveka Murder Case)లో వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి(Avinash Reddy) ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ తుది తీర్పు ఇవ్వడం కుదరని తెలంగాణ హైకోర్టు తెలిపింది. రేపటి నుంచి వేసవి సెలవులు ఉన్నందున విచారణను జూన్ 5వ తేదికి వాయిదా వేసింది. తీర్పు ఇవ్వకపోతే సీబీఐ అరెస్ట్ చేసే అవకాశముందని అవినాశ్ తరపు న్యాయవాది తెలపగా.. ఎమర్జెన్సీ అయితే ప్రధాన న్యాయమూర్తిని కలవండని జస్టిస్ సురేంద్ర సూచించారు. కనీసం రెండు వారాలైనా సీబీఐ కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా.. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేశారు.

- Advertisement -

దీంతో తాము అవినాశ్ రెడ్డి(Avinash Reddy)ని విచారణ చేసుకోవచ్చా?అని సీబీఐ తరపు న్యాయవాది కోరగా.. మీ పని మీరు చేసుకోవచ్చని.. తాము ఎలాంటి జోక్యం చేసుకోబోమని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో అత్యవసర విచారణకు అనుమతించాలని చీఫ్ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ను అవినాష్ తరఫు న్యాయవాది కోరగా.. ఇంత వేగంగా వాదనలు విన్నలేమని ఆయన స్పష్టంచేశారు. విచారణకు అనుమతిపై ప్రత్యేక కోర్టునే సంప్రదించాలని సూచించారు.

Read Also: గ్రేట్.. 60మంది ప్రాణాలు కాపాడిన బాలుడు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirumala | తిరుమలలో భారీ వర్షం.. సేదతీరిన భక్తులు..

తిరుమల(Tirumala)లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో గాలివానతో కూడిన భారీ వర్షం...

Dande Vital | బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదు.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు..

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...