తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు.. ఎన్ని రోజులంటే?

-

తెలంగాణ హైకోర్టు(TS High Court)కు వేస‌వి సెల‌వులు ప్రక‌టించారు. మే ఒకటో తేదీ నుంచి జూన్ 2వ తేదీ వ‌ర‌కు న్యాయస్థానానికి సెల‌వులు ప్రకటిస్తూ రిజిస్ట్రార్‌‌ జనరల్‌‌ నోటిఫికేషన్‌‌ జారీ చేశారు. అయితే రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం రావడంతో రేపటి నుంచే సెలవులు ఉండనున్నాయి. దీంతో ఇవాళ ఒక్కరోజే కోర్టు నడవనుంది. వరుస సెలవుల నేపథ్యంలో అత్యవ‌స‌ర కేసుల విచార‌ణ‌కు మాత్రం ప్రత్యేక బెంచ్‌లు ఏర్పాటుచేశారు. మే 4, 11, 18, 25, జూన్ 1వ తేదీన ఈ బెంచ్ లు నిర్వహించ‌నున్నట్లు రిజిస్ట్రార్ వెల్లడించారు. అంటే హెబియస్‌‌ కార్పస్‌‌ పిటిషన్లు, ముందస్తు బెయిల్, బెయిల్‌‌ పిటిషన్లు, బెయిల్‌‌ తిరస్కరణపై అప్పీల్‌‌ ఇతర ఎమర్జెన్సీ కేసులను మాత్రమే వెకేషన్‌‌ కోర్టులు విచారిస్తాయి.

- Advertisement -
Read Also: ‘సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని నిరుద్యోగులకు న్యాయం చేయాలి’

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Revanth Reddy | తెలంగాణకు బీజేపీ ‘గాడిద గుడ్డు’ ఇచ్చింది.. రేవంత్ రెడ్డి సెటైర్లు..

తెలంగాణకు పదేళ్ల మోదీ పాలనలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదని...

Janasena | ఇప్పుడే నీ పేరు మార్చుకో.. ముద్రగడకు జనసేన నేత వార్నింగ్..

పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకంటానంటూ ముద్రగడ...