తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సంస్కృతికి వ్యతిరేకంగా సచివాలయ నిర్మాణం జరిగిందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక మార్పులు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలో హిందువుల వాటా రెండు గుంటలేనని బండి సంజయ్(Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా నిర్మించిన.. కొత్త సచివాలయంలోకి తాము అడుగుపెట్టమని ఆయన స్పష్టం చేశారు. నూతన సచివాలయ(New Secretariat) ప్రారంభానికి ఆహ్వానం అందినా కూడా వెళ్ళనని అన్నారు. నూతన సచివాలయం ఏప్రిల్ 30వ తేదీన ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇక కర్నాటకను కాంగ్రెస్ పార్టీ ఏటిఎంగా వాడుకుంటుందని ఆరోపించారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా కాంగ్రెస్ లేదన్నారు. వచ్చే ఎన్నికలలో బీజేపీ(BJP) తెలంగాణలో అధికారంలోకి వస్తుందని.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవరినీ సీఎం చేసేదీ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు.
Read Also: నాకు రాజకీయ జీవితం ఇచ్చింది చంద్రబాబే: రాజాసింగ్
Follow us on: Google News, Koo, Twitter