Karnataka Elections Exit Poll 2023 |కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకూ 65.69 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. పోలింగ్ ముగియడంతో సర్వే సంస్థలు ఒక్కొక్కటిగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ప్రకటిస్తున్నాయి. కర్నాటక అసెంబ్లీలో మొత్తం 224 సీట్లకు పోలింగ్ జరిగింది. ఇందులో 113 సీట్ల మ్యాజిక్ మార్క్ అందుకున్న వారికే అధికారం దక్కబోతోంది. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్(Exit Poll)లో కాంగ్రెస్ పార్టీకి 103-118 స్ధానాలు లభించే అవకాశమున్నట్లు తేలింది. అలాగే బీజేపీకి 79-94 స్ధానాలు లభించనున్నాయి. జేడీఎస్ కు 25-33 స్ధానాలు లభిస్తాయని జీన్యూస్ పోల్ పేర్కొంది. అలాగే ఇతరులకు 2 నుంచి 5 స్ధానాలు లభించనున్నట్లు తేలింది.
Read Also: ప్రశాంతంగా ముగిసిన కర్ణాటక పోలింగ్.. ఫలితాలు అప్పుడే!
Follow us on: Google News, Koo, Twitter