కాలేయం సమస్యలు తొలగిపోవాలంటే ఈ జ్యూస్ తాగండి

-

Liver Health |జీవన శైలిలో మార్పుల కారణంతో పాటు మద్యపానం విపరీతంగా తీసుకోవడంతో కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది. మనిషి శరీరం పూర్తి ఆరోగ్యంగా ఉండాలంటే కాలేయం మెరుగ్గా పనిచేయాలి. లేదంటే లివర్ పాడైపోయి తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాంటి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కొన్ని రకాల పదార్థాలతో తయారు చేసిన జ్యూస్ తాగడం చాలా మంచిదని హెల్త్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. సొరకాయ, కొత్తిమీర, పసుపు, నిమ్మరసం కలిపిన జ్యూస్ తరచుగా పరగడుపున తీసుకోవాలని సూచిస్తున్నారు.

- Advertisement -

Liver Health | ఉపయోగాలు:

* సొరకాయలో కాలేయం శుభ్రపరిచే ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయట.
* కాలేయాన్ని మెరుగుపరచడంలో కొత్తిమీర కూడా ఎంతో మేలు చేస్తుందట.
* పసుపు ఉపయోగించడం వల్ల లివర్‌లో ఉండే విష పదార్థాలు సులభంగా తొలగిపోతాయట.

తయారుచేసే విధానం:

* ఒక కప్పు సొరకాయ ముక్కలను తీసుకుని అందులో గుప్పెడు కొత్తిమీర, కొంచెం నీరు పోసి మిక్సీ పట్టాలి.
* అనంతరం ఈ జ్యూస్‌ను ఒక గ్లాస్‌లోకి తీసుకుని అరబద్ధ నిమ్మరసం, తగినంత నల్ల ఉప్పు, పావు టీస్పూన్ పసుపు కలుపుకోవాలి.
* ప్రతిరోజు ఉదయం పరగడుపున ఈ జ్యూస్ తాగాలి. ఇది తాగిన అరగంట వరకు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు.

Read Also: ఈ చెట్టు వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Yoga Benefits | బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు

Yoga Benefits | చాలా మందికి నిద్ర లేవగానే మత్తుగా, బద్దకంగా...

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...