శ్రీముఖి పై రాహుల్ తల్లి సుధారాణి సంచలన కామెంట్లు

శ్రీముఖి పై రాహుల్ తల్లి సుధారాణి సంచలన కామెంట్లు

0
93

బిగ్ బాస్ 3 తెలుగు ముగిసిపోయింది, రన్నర్ విన్నర్ ఎవరో తేలిపోయారు, విన్నర్ గా రాహుల్ గెలిస్తే రన్నర్ గా శ్రీముఖి నిలిచింది.ఇక బిగ్ బాస్ 3 టైటిల్ గెలిచిన రాహుల్ కు అభిమానుల మద్దతు మరింత పెరిగింది అనే చెప్పాలి, ముఖ్యంగా పునర్నవి రాహుల్ ఎపిసోడ్ తనకి బాగా కలిసి వచ్చింది, హౌస్ లో రాహుల్ పాటలకు శ్రీముఖితో గొడవలకు ఆయనకు ఓటింగ్ పెరిగింది, అయితే ప్రతీది ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు రాహుల్ ఇది కూడా అతని విజయానికి కారణం అయింది.

ఇక రాహుల్ తల్లి సుధారాణి హౌస్ లోకి వచ్చిన తర్వాత పాటలు టాస్క్ లు బాగా చేయాలి అని చెప్పిన తర్వాత రాహుల్ మరింత బాగా అన్ని విషయాల్లో పార్టిసిపేట్ చేశాడు, విన్నర్ అవడంతో రాహుల్ పేరెంట్స్ చాలా ఆనందంలో ఉన్నారు.. రాహుల్ తల్లి సుధారాణి ఆసక్తికర విషయం వెల్లడించారు. బిగ్బాస్ షోలో తనకు శ్రీముఖి అంటేనే ఇష్టమని ఆమె తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. శ్రీముఖి ఏది చేసినా అందరినీ నవ్విస్తుందని, చాలా అందంగా కనిపిస్తుందని ప్రశంసించారు. తన కుమారుడికి శ్రీముఖికి కేవలం టాస్క్ ల వల్ల గొడవలు అయ్యాయన్నారు.

అంతేకాని వారు మంచి స్నేహితులు అని ఆమె తెలిపారు. తన కొడుకు మంచిగా ఉంటాడని మనసులో ఏదీ పెట్టుకోడు అని, తన నిజాయతీ రాహుల్ ని గెలిపించింది అని ఆమె అన్నారు. పెద్ద నటులు అయిన చిరంజీవి, నాగార్జున చేతుల మీదుగా బిగ్ బాస్ ట్రోపీ తీసుకోవడం చాలా ఆనందం కలిగించింది అని తెలిపారు ఆమె