యాత్ర సినిమాలో వై.ఎస్ జగన్ పాత్రలో తమిళ్ హీరో

యాత్ర సినిమాలో వై.ఎస్ జగన్ పాత్రలో తమిళ్ హీరో

0
130

ఉమ్మ‌డి ఆంద్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా రాష్ట్ర‌రాజ‌కీయాల్ని తిర‌గ‌రాసిన డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారి బ‌యోపిక్ లో మ‌ళ‌యాల సూప‌ర్‌స్టార్ మమ్ముట్టి న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ద‌ర్శ‌కుడు మ‌హి వి రాఘ‌వ్ ఈ బ‌యెపిక్ చెప్పిన విదానం న‌చ్చి చాలా గ్యాప్ త‌రువాత మమ్ముట్టి తెలుగులో న‌టిస్తున్నారు. ముఖ్యంగా మ‌డ‌మ‌తిప్ప‌ని పాత్ర కావ‌టం వ‌ల‌న డా|| వై.ఎస్. రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారి బాడీలాంగ్వేజ్ ని బాగా అవ‌గాహ‌న చేసుకొని, పూర్తి డెడికేష‌న్ తో ఈ పాత్ర‌లో ఆయ‌న చేస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన మెద‌టి లుక్ కి రెండు రాష్ట్రాల ప్ర‌జ‌ల నుండి అనూహ్య‌మైన స్పంద‌న రావ‌టంతో మ‌మ్మూట్టి గారు కూడా ఉత్సాహంగా షూటింగ్ లో పాల్గొంటున్నారు.

తాజాగా ఈ చిత్రం గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది ఇప్పుడు. ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ పాత్రను హీరో కార్తీ పోషిస్తున్నాడట. జగన్ తో సూర్య కుటుంబానికి మంచి సంబంధము ఉండడంతో కార్తీ కూడా వెంటనే ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడట. ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇక ఈ చిత్రంలో షర్మిల పాత్రలో భూమిక, వైఎస్ రాజారెడ్డి పాత్రలో జగపతి బాబు, సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని, సూరీడు పాత్రలో పోసాని, కేవీపీ పాత్రలో రావు రమేష్ నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన యాత్ర సినిమా ట్రైల‌ర్ రికార్డ్ వ్యూస్ సాధిస్తోంది. వైఎస్ జ‌యంతి సంద‌ర్బంగా చిత్ర యూనిట్ యాత్ర టీజ‌ర్ రిలీజ్ చేసింది. వైఎస్ వేషధార‌ణ‌లో ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టుడు మమ్ముట్టి ఆకట్టుకుంటున్నారు. వైఎస్ స్ట‌యిల్ అయిన ఎడం చేత్తో చేయి ఊపుతూ అభివాదం చేస్తున్న మ‌మ్ముట్టి విజువ‌ల్ మ‌రోసారి దివంగ‌త నేత‌ను గుర్త‌కు తెస్తోంది. “తెలుసుకోవాల‌ని ఉంది. వినాల‌ని ఉంది. ఈ క‌డ‌ప దాటి ప్ర‌తి గ‌డ‌ప‌లోకి వెళ్లాల‌ని ఉంది. వారితో క‌లిసి న‌డ‌వాల‌ని ఉంది. వాళ్ల గుండె చ‌ప్పుడు వినాలి ఉంది ” అంటూ వచ్చే డైలాగ్ అందరినీ ఆకట్టుకుంది. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతుంది. ఈ చిత్రాన్ని 70ఎంఎం ఎంటర్టెన్మెంట్స్ బేనర్ పై నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.