Hyderabad |సృష్టించిన జ్యూవలరీ షాప్ కేసులో కీలక పరిణామం సంచలనం సృష్టించిన జ్యువలరీ షాప్ దోపిడీ కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసారు. పరారీలో ఉన్న మరో నలుగురి కోసం వేట కొనసాగిస్తున్నారు. రెండు రోజుల క్రితం మోండా మార్కెట్ ప్రాంతంలోని హర్ష జ్యువలరీ దుకాణానికి వచ్చిన అగంతకులు తమను తాము ఐటీ అధికారులమని చెప్పుకొని 170 తులాల బంగారు బిస్కెట్లు, నగలతో ఉడాయించిన విషయం తెలిసిందే. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితులు మహారాష్ట్ర వైపు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో టాస్క్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్ కు చెందిన 5 ప్రత్యేక బృందాలు మహారాష్ట్రలోని వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాయి. గాలింపులో నేరానికి పాల్పడ్డ ఎనిమిది మందిలో జకీర్, రహీం, ప్రవీణ్, అక్షయ్ లను పోలీసులు ముంబైలో పట్టుకున్నట్టు తెలిసింది.
Read Also:
1. ‘బ్రో’ ద్వయం పోస్టర్‌లో అల్లుడికి మామ భరోసా
2. మణిపూర్‌లో మళ్లీ హింస.. పోలీసు సహా ఐదుగురి మృతి
Follow us on: Google News, Koo, Twitter