ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు(Soyam Bapu Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీలను మతమార్పిడి చేస్తే బుల్లెట్లు దింపుతామని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఆదివాసీ బిడ్డలను ముస్లింలు, క్రిస్టియన్లు మాయ మాటలతో మతం మారుస్తున్నారని.. మతం మారిన ఆదివాసీలకు ఎస్టీ హోదా తొలగించాలని డిమాండ్ చేశారు. జ్వరం వచ్చిన ఆదివాసీలకు పారాసిటమాల్ టాబ్లెట్ వేసిన నీటిని దైవజలం అని తాగించి నయమైందని మాయ మాటలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం మతం మారేలా ప్రోత్సహిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఉద్యోగాలు వచ్చిన ఆదివాసీ ఆడపిల్లలను టార్గెట్ చేస్తూ మత మార్పిడిలు జరుగుతున్నాయని చెప్పారు. ఇకనైనా ఆదివాసీలు చైతన్యవంతులుగా మారి మత మార్పిడిలను వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే ఇంకోసారి ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపైకి డైరెక్ట్ బుల్లెట్లు దిగుతాయని బాపూరావు(Soyam Bapu Rao) వార్నింగ్ ఇచ్చారు.