టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతపై సంచలన వ్యాఖ్యలు చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం(Thammineni Seetharam)పై ఆ పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర(Dhulipalla Narendra) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డిగ్రీ తప్పిన స్పీకర్ లా ఎలా చదివారు? అని ప్రశ్నించారు. సీఎం జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, స్పీకర్ సెక్యూరిటీ లేకుండా బయట తిరగ్గలరా? అని నిలదీశారు. టీడీపీ మినీ మేనిఫెస్టోతో వైసీపీలో అలజడి మొదలైందని విమర్శలు చేశారు. 151 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న వైసీపీ.. 23 మంది ఎమ్మెల్యేలున్న టీడీపీని చూసి ఎందుకు వణుకుతోందని ఎద్దేవా చేశారు. మినీ మేనిఫెస్టో చిన్న టీజర్ మాత్రమేనని.. అసలు సినిమా దసరాకు చూపిస్తామని తెలిపారు. కొడాలి నాని అసమర్థుడు కాబట్టే మంత్రి పదవి నుంచి ఊడగొట్టారని అన్నారు. మంత్రివర్గం నుంచి తరిమికొడితే పిచ్చిపిచ్చిగా వాగుతున్నాడని ధూళిపాళ్ల(Dhulipalla Narendra) ఎద్దేవా చేశారు.