Telangana |వేసవి సెలవులు ముగిసి.. స్కూళ్లు ప్రారంభం అవుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం (2023-24) నుంచి 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్ పంపిణీ చేయాలని ఫిక్సైంది. మొత్తం 6 నుంచి 14 వరకు ఉచిత నోట్ బుక్స్ అందించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఒక్కో విద్యార్ధికి ఉచితంగా 14 నోట్ బుక్స్ ఇవ్వనున్నారు. దీంతో ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు, మోడల్ స్కూల్స్, గురుకుల విద్యాసంస్థలు, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్, కేజీబీవీలలో చదివే దాదాపు 12 లక్షల విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. ఉచిత పుస్తకాల కోసం దాదాపు రూ.56.24 కోట్ల అంచనా వ్యయంతో 1,17,88,699 నోట్ పుస్తకాలను రాష్ట్ర ప్రభుత్వం(Telangana Govt) పంపిణీ చేయనుంది. 6, 7వ తరగతి చదువుతున్న ఒక్కో విద్యార్థికి 200 పేజీలతో కూడిన 6 నోట్ బుక్స్, 8వ తరగతి చదువుతున్న ఒక్కో విద్యార్థికి 7 నోట్‌బుక్స్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.