ఒడిశా రైలు ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పందించారు. ప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆవేదన చెందారు. ఈ ఘటనలో 278 మంది అమాయక ప్రయాణికులు చనిపోవడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నట్లు ప్రకటించారు. ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్ ప్రెస్, బెంగళూరు – హౌరా సూపర్ ఫాస్ట్ రైళ్లలో తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సమాచారం అందుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ(Telangana) రాష్ట్ర ప్రభుత్వాలు బాధిత ప్రయాణికులు, వారి కుటుంబాలకు సహాయం అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ దుర్ఘటన నేపథ్యంలో రైలు ప్రమాద ఘటనల నివారణకు సంబంధించిన భద్రత చర్యలపై కేంద్ర ప్రభుత్వం తక్షణ దృష్టి పెట్టాలని పవన్ కల్యాణ్(Pawan Kalyan) కోరారు.
తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.. రైలు ప్రమాదంపై పవన్ కల్యాణ్
-