రైలు ప్రమాద ఘటనపై బెంగాల్ సీఎం అనుమానం

-

ఒడిశా(Odisha) రైలు ప్రమాద ఘటనపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) స్పందించారు. ప్రమాదంలో మరణించిన తమ రాష్ట్రానికి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరుపున ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని(Ex gratia) ప్రకటించారు. తీవ్ర గాయాలపాలైన వారికి ఒక్కొక్కరికి రూ. 1 లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలను ప్రకటించారు. ఈ ప్రమాదంలో బెంగాల్‌కు చెందిన ప్రయాణికులే ఎక్కువ మంది ఉన్నారు. ఈ ఘటన వెనుక కుట్రకోణం ఉండవచ్చునని సీఎం మమతా బెనర్జీ అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేంద్రం దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. అయితే, ఇది రాజకీయాలు చేసే సమయం కాదని ఈ ఘటన ఎలా జరిగిందో తెలుసుకుని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన తరుణమని మమత అన్నారు. హెలికాప్టర్ ద్వారా ఒడిశాకు చేరుకున్న మమతా బెనర్జీ(Mamata Banerjee) … కటక్‌లోని ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు.

Read Also:
1. రైల్వేశాఖ మంత్రిపై కేఏ పాల్ సీరియస్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...