ఆఫ్ఘనిస్థాన్‌లో బాంబు పేలుడు.. డిప్యూటీ గవర్నర్ మృతి

-

ఆఫ్ఘనిస్థాన్‌(Afghanistan)లో మంగళవారం ఉదయం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఉత్తర బదక్షన్ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ నిస్సార్ అహ్మద్ అహ్మది మరణించారు. అదేవిధంగా ఈ ఘటనలో మరో ఆరుగురు పౌరులు గాయపడ్డారని ప్రావిన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ అధిపతి మహజుదీన్ అహ్మదీ చెప్పారు. ఈ దాడి వెనుక ఎవరున్నారో స్పష్టంగా తెలియరాలేదన్నారు. చాలా వారాల తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌(Afghanistan)లో జరిగిన మొదటి అతిపెద్ద పేలుడు ఇది అని అన్నారు. ఓ వ్యక్తి కారులో పేలుడు పదార్థాలను నింపుకొని అహ్మది ప్రయాణిస్తున్న వాహనం సమీపంలోకి దూసుకు వచ్చి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ప్రావిన్స్‌లో సాంస్కృతిక, సమాచార విభాగానికి అహ్మది అధిపతిగా కూడా వ్యవహరిస్తున్నారు. కాగా, ఐసిస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా తాలిబన్ ప్రభుత్వం కాబుల్ సహా వివిధ పట్టణాలలో దాడులు చేస్తోంది.

Read Also:
1. తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రభాగాన ఉంది: సీఎం కేసీఆర్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...