WTC: ఫైనల్‌ మ్యాచ్‌లో ఏం చేయాలో మా ఆటగాళ్లకు తెలుసు: రోహిత్

Rohit Sharma

వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్(WTC) ఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) కీలక వ్యాఖ్యలు చేశారు. జట్టును ముందుకు తీసుకెళ్లడంలో ఆటగాళ్లందరూ తమ పాత్ర పోషిస్తారని అన్నారు. ‘ప్రతి కెప్టెన్ చాంపియన్‌షిప్ గెలవాలనుకుంటాడు. నేనూ అంతే. నేను ఈ బాధ్యతల నుంచి వెళ్లాలనుకున్నప్పుడు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ చాంపియన్‌షిప్ గెలిచి ఉంటే బాగుంటుంది కదా. మేము ఏం గెలిచామో, ఏం ఓడామో మాకు తెలుసు. దాని గురించి ఎక్కువ ఆలోచించి ప్రయోజనం లేదు. అందుకే ఎక్కువ ఒత్తిడి తీసుకోవాలనుకోవడం లేదు’ అని తెలిపాడు.

‘డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఏం చేయాలో మా ఆటగాళ్లకు తెలుసు. మా బలాలపై ఫోకస్ పెడతాం’ అని చెప్పాడు. అశ్విన్(Ashwin) ఎంపికపై మాట్లాడుతూ.. ఇంగ్లాండ్‌లో ప్రతి రోజు పరిస్థితులు మారుతుంటాయని, తుది జట్టు ఎంపికపై నేడు క్లారిటీ వస్తుందని తెలిపాడు. పిచ్ సీమర్లకు అనుకూలించేలా కనిపిస్తుందని చెప్పాడు. ‘గత ఎడిషన్‌లో మేము కొన్ని తప్పులు చేశాం. జట్టు సభ్యులతో వాటి గురించి ఇప్పటికే చర్చించాం. ఆ తప్పులను ఈ సారి పునరావృతం చేయాలనుకోవడం లేదు. వచ్చే ఐదు రోజులు తమకు చాలా ముఖ్యమైనవి. మేము ఏదైతే అనుకుంటున్నామో దానిపై ఫోకస్ పెడతాం’ అని రోహిత్ (Rohit Sharma) చెప్పుకొచ్చాడు.

Read Also:
1. ఒక్క రాత్రిలో కోటీశ్వరుడైన కర్నూలు రైతు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here