ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు తమ బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇప్పటికే నితిన్, నిఖిల్, రానా ఓ ఇంటివారు కాగా తాజాగా శర్వానంద్ కూడా పెళ్లి పీటలెక్కాడు. ఇక వీరి బాటలోనే మరో యంగ్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) కూడా చేరబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తెను రామ్ పెళ్లి చేసుకోనున్నట్లు ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరువురి కుటుంబ పెద్దల మధ్య చర్చలు జరిగాయట. అతి త్వరలోనే వీరి ఎంగేజ్‌మెంట్ జరగనుందని సమాచారం. ప్రస్తుతం బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ అయిపోగానే మ్యారేజ్ ఉంటుందట. అందుకే ఇప్పటివరకు మరో సినిమాను రామ్ ప్రకటించలేదని చెబుతున్నారు.