భారీ అంచనాల మధ్య విడుదలైన లైగర్ సినిమా ప్లాప్ అవ్వడంతో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా గడుతున్నాడు. లైగర్ ఫలితం ఎలా ఉన్నా విజయ్ మాత్రం వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. అందులో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఒకటి. ఐదు నెలల క్రితం మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ సినిమాపై తిరుగులేని హైప్ తెచ్చిపెట్టింది. పోలీస్ డ్రెస్‌లో మొహానికి ముసుగు ధరించిన పోస్టర్ అప్పుడు నెట్టింట ట్రెండింగ్‌లో నిలిచింది. అంతేకాకుండా నేను ఎవరికి ద్రోహం చేశానో చెప్పడానికి నేను ఎక్కడున్నానో కూడా నాకు తెలియదు అంటూ పోస్టర్‌పై ఓ క్యాప్షన్‌ను ఇచ్చి ప్రేక్షకుల్లో తిరుగులేని క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. ఇక గత నెలలో గ్రాండ్‌గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిపారు. కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ మేరకు మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. విజయ్(Vijay Devarakonda) గన్ పట్టుకుని కాల్చుతున్న పోస్టర్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యలో తెరకెక్కబోతున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైనమెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్డూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నారు.
Read Also:
1. సంక్రాంతి బరి నుంచి వెనక్కి తగ్గిన మహేశ్ బాబు!
2. డివైడ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటిన ‘ఆదిపురుష్’
Follow us on: Google News, Koo, Twitter, ShareChat