Hari Rama Jogaiah | పవన్ కల్యాణ్ సీఎం కావాలంటే.. కాపులు చేయాల్సిన పని ఇదే!

-

మాజీ ఎంపీ, కాపు సంక్షేమ శాఖ అధ్యక్షుడు హరిరామ జోగయ్య(Hari Rama Jogaiah) మరో లేఖ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పాలన పోవాలి… పవన్ సుపరిపాలన రావాలని ఆకాంక్షించారు. పవన్ అధికారంలోకి రావాలంటే కాపులంతా సమైక్యంగా మెలగాలని కోరారు. బీసీ, ఎస్సీ, మైనారిటీలకు పవన్ ప్రాధాన్యమివ్వాలని హరిరామ జోగయ్య(Hari Rama Jogaiah) సూచించారు. జగన్ ఓటమి కోసం ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. జనం మెచ్చేలా టీడీపీ, జనసేన మేనిఫెస్టో ఉండాలన్నారు. కాగా, మొదటి దశలో భాగంగా జూన్ 14న ఉభయగోదావరి జిల్లాలో ప్రారంభం అయిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర(Varahi Yatra) నేటి(జూన్ 30)తో ముగియనుంది. ఈ యాత్ర ప్రతిరోజూ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గానే నిలుస్తూ వచ్చింది. దీంతో ఉభయగోదావరి జిల్లాలో వారాహి యాత్ర కారణంగా జనసేనకు మైలేజ్ పెరిగిందని ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా.. మొదటి దశ యాత్ర ముగింపు సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నేడు జనసేన బహిరంగ సభ జరుగుతోంది. ఈ సభలో పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

- Advertisement -
Read Also:
1. ‘చంద్రబాబు ప్రతిసారీ ఎలా గెలుస్తున్నాడో అర్ధం కావడం లేదు’

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...