ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ జనగర్జన సభలో రాహుల్ గాంధీ(Rahul Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్(KCR)ను టార్గెట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌ను బీజేపీకి బీ-టీమ్‌గా పోల్చిన ఆయన.. బీఆర్ఎస్ అంటే ‘‘బీజేపీ రిష్తెదార్ సమితి’’ అని అభివర్ణించారు. కేసీఆర్ స్కాంలు మోడీకి తెలిసినా ఆయన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కేసీఆర్ రిమోట్ కంట్రోల్ మోడీ చేతిలో వుందన్నారు. తెలంగాణలో బీజేపీ ఖతమైపోయిందని.. ఇప్పుడు రాష్ట్రంలో ఆ పార్టీ అడ్రస్ లేదన్నారు. సమాజంలో అన్ని వర్గాలను కేసీఆర్ దోచుకున్నారని.. పార్లమెంట్‌లో బీజేపీకి అన్ని విధాలుగా బీఆర్ఎస్ అండగా నిలిచిందని రాహుల్ దుయ్యబట్టారు. రైతుల బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తే.. బీఆర్ఎస్ మద్ధతిచ్చిందని ఆయన గుర్తుచేశారు. కర్ణాటకలో బీజేపీని ఓడించినట్లే తెలంగాణలో బీఆర్ఎస్‌ను ఓడిస్తామని రాహుల్ గాంధీ తెలిపారు. బీఆర్ఎస్‌తో తమకు ఎలాంటి ఒప్పందం లేదని.. ఇటీవల జరిగిన విపక్షాల సమావేశానికి బీఆర్ఎస్ వస్తే మేం రాం అని చెప్పామని ఆయన గుర్తుచేశారు.
కేసీఆర్ తెలంగాణకు రాజులా భావిస్తాడని, రాష్ట్రాన్ని జాగీరులా ఫీలవుతాడని రాహుల్ మండిపడ్డారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం నిరుపేదలకు, గిరిజనులకు ఇచ్చిన భూములను కేసీఆర్ లాక్కుంటున్నారని ఆరోపించారు. ఈ భూముల విషయం భారత్ జోడో యాత్రలో తన దృష్టికి తీసుకొచ్చారని.. ఈ భూములు కేసీఆర్‌వి కావని మీవని రాహుల్ చెప్పారు. ముఖ్యమంత్రి అవినీతి పరాకాష్టకు చేరిందని.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నారు. ధరణి పోర్టల్ విషయం భారత్ జోడో యాత్ర చేసినప్పుడు తన దృష్టికి వచ్చిందని రాహుల్ గాంధీ తెలిపారు. ధరణి ద్వారా ముఖ్యమంత్రి భూములను , మిషన్ భగీరథలో వేల కోట్లు దోచుకున్నారని దుయ్యబట్టారు. రైతులు, దళితులు, ఆదివాసీలు ఇలా అన్ని వర్గాల నుంచి కేసీఆర్ దోచుకుంటున్నారని రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆరోపించారు.
Read Also:
1. జనగర్జన సభలో ఎన్నికలే లక్ష్యంగా రాహుల్ భారీ హామీ
2. ఖమ్మం సభపై మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat