గన్నవరం ఎమ్మెల్యే వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పారు.. అయితే దీపావళికి వంశీ వైసీపీలో చేరిపోతారు అని వార్తలు వచ్చాయి.. కాని ఆయన మాత్రం పార్టీలో చేరలేదు.. అయితే అక్కడ వంశీ పార్టీలో చేరితే ఇప్పటి వరకూ పార్టీకి వెన్నంటి ఉన్న యార్లగడ్డ వెంకట్రావు కూడా ఒప్పుకోరు అనేది బహిరంగ సత్యం ..పైగా వంశీ మళ్లీ వైసీపీ తరపున టికెట్ పొంది ఎమ్మెల్యే అయితే యార్లగడ్డ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పడుతుంది.
అందుకే యార్లగడ్డ వెంకట్రావు మాత్రం వంశీ వైసీపీలో చేరే ఆలోచనలో లేరని అంటున్నారట.. అంతేకాదు తనకు కూడా కలిసి పనిచేయడం ఇష్టం లేదు అని చెబుతున్నారు సన్నిహితులతో.. గతంలో వంశీ యార్లగడ్డ మధ్య పెద్ద పెద్ద వివాదాలు నడిచాయి.. ఈ సమయంలో ఇద్దరు కలిసి పనిచేస్తారు అంటే ఇది నమ్మశక్యం కాని అంశమే అని చెప్పాలి..
అయితే వంశీని పార్టీలో చేర్చుకోవాలని జిల్లా నేతలు పట్టుపడుతున్నారు.. తమ సెగ్మెంట్ మాత్రం వదులుకోకూడదు అని టీడీపీ పావులు కదుపుతోంది.. కాని వంశీ మాత్రం టీడీపీనేతలకు చెప్పేశారట. ఇక పార్టీలో ఉండేది లేదు నన్న ఎవరూ కలవకండి అని.
అయితే వైసీపీలో మాత్రం భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. వంశీ పార్టీలో చేరాలని కీలక నేతలు అందరూ భావిస్తుంటే.. ఇద్దరు ముగ్గురు మినహ మిగిలిన వారు ఎవరూ కూడా వంశీ చేరికని వద్దు అనడం లేదు అని తెలుస్తోంది, మరి వంశీ రూటు ఎలా ఉంటుందో.